Friday, December 20, 2024

ఢిల్లీ ఎక్యుఐ 494, కానీ ఐక్యు ఎయిర్ సూచన 1600?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ వాయు నాణ్యత మంగళవారం తీవ్ర విషపూరితంగా కొనసాగింది. కలుషితాలను గణించే మొత్తం గాలి నాణ్యత సూచి (ఎక్యుఐ) 494కు పెరిగింది. కేంద్ర కాలుష్య నివారణ మండలి (సిపిసిబి) డేటా ప్రకారం, దేశ రాజధానిలో పర్యవేక్షించే కేంద్రాల్లో చాలా వరకు ఎక్యుఐని 500గా నమోదు చేశాయి. దీనితో ఢిల్లీ ఎన్‌సిఆర్ వ్యాప్తంగా పాఠశాలలు అన్నిటినీ ఆన్‌లైన్‌లో బోధనలకు వెళ్లేలా చేశాయి. అయితే, అదే సమయంలో అంతర్జాతీయ పర్యవేక్షణ యాప్, ఐక్యు ఎయిర్, ఢిల్లీ ఎక్యుఐని 1600గా చూపింది. అన్ని దేశాలు గాలి నాణ్యత సూచిని గణించడానికి వేర్వేరు ప్రమాణాలు పాటిస్తుంటాయి. అది ఒక దేశానికి, మరొక దేశానికి మారుతుంటుంది. కలుషితాలు, వాటిని గణించే స్థాయిని బట్టి అది ఉంటుంది. భారత్‌లో పిఎం2.5 స్కేల్ 60, కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (హు) ప్రమాణాన్ని అనుసరించే కొన్ని దేశాల్లో అది ఐదు నుంచి పది వరకు ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News