Wednesday, January 22, 2025

ఆ రూఫ్ 2008లో నిర్మించినది: ప్రభుత్వ వర్గాలు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద కూలిపోయిన రూఫ్ 2008-09లో నిర్మించినదని, దాని పనిని జిఎంఆర్ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించిందని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. రూఫ్ కూలిపోవడానికి బిజెపి ప్రభుత్వానిదే బాధ్యత అని మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా కాంగ్రెస్ అగ్ర నేతలు ఆరోపించిన తరువాత ప్రభుత్వ వర్గాలు ఈ విధంగా స్పందించాయి.

అయోధ్య, జబల్పూర్, ఇప్పుడు ఢిల్లీ విమానాశ్రయంలో చూసినట్లుగా భవన ప్రాజెక్టులలో ‘నాసి రకం’ నిర్మాణ పనులకు, అవినీతికి ప్రధాని బాధ్యత వహిస్తారా అని కూడా ప్రియాంక గాంధీ అడిగారు. దుర్ఘటన ప్రదేశాన్ని సందర్శించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు ‘మేము ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన భవనం ఆవలి వైపు ఉన్నదని, ఇక్కడ కూలిపోయిన భవనం పాతదని, 2009లో ప్రారంభించినదని స్పష్టం చేయదలిచాను’ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News