Sunday, December 22, 2024

ఢిల్లీ విమానాశ్రయంలో కూలిన పైకప్పు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరసగా రెండో రోజు వర్షం బీభత్సం సృష్టించింది. ఢిల్లీలోని విమానాశ్రయం టెర్మినల్-లో పైకప్పు కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పైకప్పు కూలిన ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు, విమానాయన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. టెర్మినల్ 1 నుంచి విమాన సర్వీసులు రద్దు చేశారు. ముందుజాగ్రత్తగా విమానాశ్రయ వర్గాలు చెక్ ఇన్ కౌంటర్లను మూసివేశారు. ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్-1లో ఊడిపడిన ప్రాంతాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ రాయుడు పరిశీలించారు. ఉదయం 5 గంటలకు టెర్మినల్-1లో పైకప్పు ఊడిపడిందని రామ్మోహన్ రాయుడు తెలిపారు. గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, ఘటన స్థలిలో సిఐఎస్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News