Sunday, January 19, 2025

బాలికపై యాసిడ్ పోసి… నిందితుడు యాసిడ్ తాగి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అత్యాచారం కేసులో నిందితుడు బాలికపై యాసిడ్ పోసి, తాను యాసిడ్ తాగిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రేమ్‌సింగ్ అనే వ్యక్తి ఓ మహిళపై అత్యాచారం చేశాడు. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తన ఇంట్లో పెళ్లి ఉందని బెయిల్‌పై అతడు బయటకు వచ్చాడు. కేసు విత్ డ్రా చేసుకోవాలని బాధితురాలిని పలుమార్లు బెదిరించాడు. ఆమె విత్‌డ్రా చేసుకోనని చెప్పడంతో బాధితురాలు కూతురుపై యాసిడ్ పోసి అనంతరం నిందితుడు యాసిడ్ తాగాడు. వెంటనే స్థానికులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రేమ్‌సింగ్ మృతి చెందగా బాలిక చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మెట్రపాలిటన్ నగరాలలో 19 యాసిడ్ కేసులు జరగగా ఒక ఢిల్లీలోనే అత్యధికంగా ఏడు జరిగాయని క్రైమ్ బ్యూరో వెల్లడించింది. సదరు మహిళతో అతడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News