Thursday, January 23, 2025

రెండు రోజులపాటు ‘నో ఫ్లయింగ్ జోన్’ గా ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీని జూన్ 9,10 తేదీలలో ‘నో ఫ్లయింగ్ జోన్’ గా ప్రకటించారు. ఉత్తర్వులు జారీ చేశారు.  ప్రతి వ్యక్తికి తెలుపకుండా సంబంధిత పక్షాలకు తెలిసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 9న పదవీ స్వీకరణ చేపట్టనున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దేశ రాజధానిని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మోడీ పదవీ స్వీకరణకు మాల్దీవుల అద్యక్షుడు ముయిజ్ హాజరు కానున్నారు. పదవీ స్వీకరణ తర్వాత మోడీ ఇటలీలోని మెలోనిలో జి7 శిఖరాగ్ర సమావేశాలకు వెళ్లనున్నారు. లోక్ సభలో 272 మెజారిటీ సంఖ్యను సాధించనప్పటికీ తెలుగు దేశం, జనతా దళ్(యునైటెడ్) మద్దతుతో ఎన్ డిఏ ప్రభుత్వం కొలువుదీరబోతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News