Monday, January 20, 2025

ఢిల్లీ నడి వీధిలో తుపాకీతో కాల్చి… రూ.5 లక్షలు ఎత్తుకెళ్లారు…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌లపై వచ్చి 42 ఏళ్ల వ్యక్తిని తుపాకీతో కాల్చి అతడి వద్ద నుంచి ఐదు లక్షల రూపాయలు ఎత్తుకెళ్లిన సంఘటన ఢిల్లీలోని శక్తి నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జనవరి 14 రాత్రి సమయంలో హన్నీ కర్లా అనే వ్యక్తి షాలీమర్ ప్రాంతంలో బహదూర్‌గఢ్‌లో ఐదు లక్షల రూపాయలు తీసుకొని వెళ్తుండగా రూప్ నగర్ ప్రాంతంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి హన్నీ ద్విచక్రవాహనాన్ని అడ్డుకున్నారు.

అతడిని కిందపడేసి దాడి చేశారు. అతడి చేతిలో ఉన్న బ్యాగ్ ఇవ్వకపోవడంతో గన్‌తో తొడపై కాల్చారు. అక్కడ వాహనదారులు కళ్లు అప్పగించి చూస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు. కారులో ఉన్న ఓ వ్యక్తి అడ్డుకోవడానికి ప్రయత్నించడంలో అతడి కారుపై కాల్పులు జరపడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. హన్నీ దగ్గర ఉన్న ఐదు లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. అక్కడ ఉన్న సిసి కెమెరాలో ఈ ఘటన రికార్డు నిక్షిప్తమైంది. అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News