Sunday, December 22, 2024

ఢిల్లీ బిజెపి చీఫ్ ఆదేశ్ గుప్తా రాజీనామా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవలి ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చేతిలో బిజెపి తీవ్రంగా అపజయం పొందిన నేపథ్యంలో ఆయన ఈ రాజీనామా చేశారు. ఆదేశ్ గుప్తా తన రాజీనామాను పంపించగా, బిజెపి అధిష్ఠానం దానిని ఆమోదించిందని తెలిసింది. ఇక ఎఎన్‌ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం ఢిల్లీ బిజెపి ఉపాధ్యక్షుడిగా ఉన్న వీరేంద్ర సచ్‌దేవ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారని తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News