Monday, January 20, 2025

కేజ్రీవాల్‌పై బిజెపి ‘ఝూటా కహీ కా’ ప్రచారం!

- Advertisement -
- Advertisement -
ఆమ్ ఆద్మీ పార్టీపై బిజెపి సరికొత్త దాడి ఆరంభించింది

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ బిజెపి శనివారం 14 ప్రత్యేక వ్యాన్‌లను జెండా ఊపి ప్రారంభించింది. ఈ వాహనాలు నగరమంతా తిరిగుతాయని, ‘అబద్ధాలు, యుటర్న్‌ల’ పై 27 నిమిషాల వీడియోను చూపుతాయని ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ తెలిపారు. ఈ వ్యాన్లు వచ్చే నాలుగు వారాల్లో 4200 ప్రదేశాలు సందర్శిస్తాయని తెలిపారు.

కేజ్రీవాల్ తన ఇంటిని ప్రజల కోసం తెరువాలని, ఆ ఇంట్లో ఏమేమి ఉన్నాయో చూడనివ్వాలని ఢిల్లీ బిజెపి డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా ఆప్ ఎదురు దాడికి దిగుతూ బిజెపి కీలక అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తోందని పేర్కొంది. అంతేకాక ప్రధాని, ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసాల ఖర్చులను కూడా పోల్చాలని డిమాండ్ చేసింది. ప్రధాని , బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల నివాస ఖర్చుల గురించి పేర్కొంది.

ఢిల్లీ బిజెపి నాయకులు సచ్‌దేవ, బైజయంత్ పాండా, రామ్‌వీర్ సింగ్ బిధూరి, హర్షవర్ధన్ శనివారం సంయుక్తంగా పార్టీ యూనిట్ కార్యాలయంలో పసుపు వీడియో వ్యాన్‌లకు జెండా ఊపడం ద్వారా ‘ఝూటా కహీ కా’ ప్రచారాన్ని ఆరంభించారు. గత ఎనిమిదేళ్లుగా కేజ్రీవాల్ ‘అబద్ధాలు, యూటర్న్‌లను’ ఈ ప్రచారం బహిర్గతం చేస్తుందని బిజెపి పేర్కొంది.

ఈ వీడియో వ్యాన్‌లు ఢిల్లీలోని 14 జిల్లాలను సందర్శించి ‘కేజ్రీవాల్ అబద్ధాలు, మోసం, అవినీతి కథను వివరిస్తాయి’ అని పాండా చెప్పారు. ‘కేజ్రీవాల్ టివి స్క్రీన్‌లకు రూ. 1 కోటి ఖర్చు చేస్తారని, ఇది సామాన్యుడి తీరు కాదని’ కూడా ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా బిజెపి శుక్రవారం కేజ్రీవాల్ నివాసం వద్ద చేపట్టిన నిరంతర ధర్నాను ఆపేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News