న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ది ‘‘గూండాయిజం, దాదాగిరి” అని ఆరోపించినందుకు ఢిల్లీ బిజెపి ప్రతినిధి తజిందర్ పాల్ సింగ్ బగ్గా అరెస్టయ్యాడు. శుక్రవారం తన కొడుకు చెప్పులు వేసుకోవడానికి లేదా అతని ‘సిర్పా’ (సిక్కులు ధరించే వస్త్రం) కట్టుకోవడానికి కూడా అనుమతించలేదని ఆయన తల్లి ఆరోపించారు. అతన్ని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. బగ్గా తండ్రి, అతడి అరెస్టును చిత్రీకరించడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు అతనిపై కూడా దాడి చేశారని ఆమె ఆరోపించింది.
“పంజాబ్ పోలీసులు ఉదయాన్నే వచ్చి అతనిని (బగ్గా) మా ఇంటిలో పట్టుకున్నారు. ఆ సమయంలో తేజిందర్ నిద్రపోతున్నాడు. అతను తన చెప్పులు ధరించొచ్చా, తన సిరోపాను కట్టుకోవచ్చా అని అడిగాడు, కానీ వారు(పోలీసులు) దానికి అనుమతించలేదు, ” అని కమల్జీత్ కౌర్ అన్నారు. ఒక సిక్కు వ్యక్తి తన సిరోపాను కట్టుకోకుండా నిషేధించడం “పెద్ద నేరం” అని కూడా ఆమె అన్నారు. “నా భర్త సంఘటనను చిత్రీకరించడానికి ప్రయత్నించినప్పుడు, వారు అతని ఫోన్ లాక్కొని అతనిపై కూడా దాడి చేశారు, కాబట్టి అతను ఎవరికీ తెలియజేయలేకపోయాడు. అతని ముఖంపై కొట్టారు ” అని ప్రస్తుతం బీహార్‌లో ఉన్న కమల్జీత్ కౌర్ తెలిపారు.