Sunday, December 22, 2024

బ్యాగ్‌లో బాంబు ఉందంటూ ప్రయాణికుడి బెదిరింపు …

- Advertisement -
- Advertisement -

అత్యవసరంగా దిగిన విమానం

న్యూఢిల్లీ : 185 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఆకాశ ఎయిర్ విమానం శనివారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. బాంబు బెదిరింపు రావడంతో పుణె నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం ముంబై విమానాశ్రయంలో దిగాల్సి వచ్చింది. నా బ్యాగులో బాంబు ఉంది అంటూ ఓ ప్రయాణికుడు బెదిరించడంతో ఢిల్లీకి బయల్దేరిన ఆకాశ ఎయిర్ విమానం శనివారం ఉదయం ముంబై లో దిగింది. ఆ వెంటనే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్వాడ్ కు సిబ్బంది సమాచారం అందించారు.

ఈ బెదిరింపులకు దిగిన వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులో తీసుకొని, బ్యాగును తనిఖీ చేయగా అనుమానాస్పదంగా ఏమీ లభ్యం కాలేదు. 185మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఈ విమానంలో ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన వెంటనే భద్రతాపరమైన హెచ్చరిక రావడంతో వెంటనే ముంబైకి దారి మళ్లించామని, అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయిందని విమాన యాన సంస్థ వెల్లడించింది. సదరు ప్రయాణికుడి బంధువు కూడా విమానంలో ఉన్నట్టు ముంబై పోలీస్‌లు తెలిపారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్టు వెల్లడించారు. ప్రయాణికుడి మానసిక స్థితిని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News