Wednesday, January 22, 2025

సీక్రెట్ గా కెమెరా పెట్టాడు… బాలికపై అత్యాచారం వెలుగులోకి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: తండ్రి క్షుద్ర పూజలు చేస్తున్నాడనే అనుమానంతో కుమారుడు మొబైల్ కెమెరా ఆన్ చేశాడు. మొబైల్ కెమెరాలో పక్కింటి బాలికపై తండ్రి అత్యాచారం చేసినట్లు వీడియో నిక్షిప్తమయ్యింది. ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన ఢిల్లీలో బురారీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 68 ఏళ్ల వ్యక్తి తన కుమారుడితో కలిసి ఉంటున్నాడు. పక్కింటి వాళ్లతో వృద్ధుడు సన్నిహితంగా ఉండేవాడు.

Also Read: కారు టాపుపై యువకుల హల్‌చల్: ట్రాఫిక్ పోలీసుల చలాన్

పక్కింటి వాళ్లతో కలిసి పలు దేవాలయాలకు కూడా వెళ్లారు. తండ్రి క్షుద్ర పూజలు చేస్తున్నాడని కుమారుడికి అనుమానం ఉండేది. దీంతో తండ్రి రూమ్‌లో సీక్రెట్ గా మొబైల్ లో కెమెరా ఆన్ చేసి వెళ్లి పోయాడు. పక్కింట్లో ఎవరు లేనప్పడు బాలికను తన రూమ్‌కు వృద్ధుడు తీసుకొచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలు పోన్‌లో రికార్డయ్యాయి. ఆ వీడియోను బాలిక తండ్రికి పంపించాడు. దీంతో అతడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News