Sunday, April 13, 2025

చెన్నైతో మ్యాచ్‌: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించి ఉత్సాహంతో ఉన్న ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్‌లోనూ చెన్నైని ఓడించాలని భావిస్తోంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాభవాన్ని రుచి చూసిన చెన్నై ఈ మ్యాచ్‌తో పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తమ జట్టులో ఒక మార్పు చేసింది. డుప్లెసిస్ స్థానంలో సమీర్ రిజ్విని జట్టులోకి తీసుకుంది. ఇఖ చెన్నై తమ టీం లో రెండు మార్పులు చేసింది. ఓవర్‌టన్ స్థానంలో కాన్వే, త్రిపాఠి స్థానంలో ముకేశ్ జట్టులోకి వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News