Wednesday, March 26, 2025

లక్నోతో మ్యాచ్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

విశాఖ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా విశాఖపట్నంలోని డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. ‘మేం ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. అందుకే ముందుగా బౌలింగ్ వేస్తాం. నాకు పంత్ గురించి ఎప్పటి నుంచో తెలుసు. అతనికి నా గురించి తెలుసు. కాబట్టి ఆ ట్రిక్స్‌ని అమలు చేస్తాం’ అని అన్నాడు. అనంతరం లక్సో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. ‘నేను టాస్ గెలిస్తే బౌలింగ్‌నే ఎంచుకొనే వాడిని. ఢిల్లీ తరఫున ఎన్నో ఏళ్తుగా ఆడాను. ఇప్పుడు మా తయారీలో మేం ఉన్నాము’ అని అన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News