Wednesday, January 22, 2025

ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్ల చోరీ: విమానం కార్గోలోనే క్రికెట్ కిట్లు మాయం

- Advertisement -
- Advertisement -

షాదోల్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రాంచెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు చెందిన బ్యాట్లు, ప్యాడ్లు, ఇతర క్రీడా సామగ్రి చోరీకి గురయ్యింది. బెంగళూరు నుంచి న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత వీరి క్రీడా వస్తువులు చోరీ అయినట్లు వర్గాలు తెలిపారు.

కార్గో నుంచి కిట్ బ్యాగ్లు మరుసటి రోజు రావడంతో చోరీ విషయం ఒకరోజు ఆలస్యంగా వీరి దృష్టికి వచ్చింది. ప్లేయర్లందరి బ్యాట్లు పోయాయి. బ్యాట్స్‌మన్ యష్ ధుల్ అయితే ఐదు బ్యాట్లు కోల్పోయాడు. విదేశీ ప్లేయర్లు రూ. 1 లక్ష విలువ చేసే బ్యాట్లను కోల్పోయారు. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలన్న విషయమై ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు తర్జనభర్జన పడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసే విషయం కూడా యోచిస్తున్నారు.

ఐపిఎల్ 2023కి చెందిన పాయింట్స్ టేబుల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చిట్టచివర ఉంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో వారు ఓడిపోయారు. ఏప్రిల్ 15న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సిబి)తో ఆడిన చివరి మ్యాచ్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తదుపరి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News