నరాలు తెగే ఉత్కంఠత మధ్య సాగిన మ్యాచ్‌లో ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది. సోమవారం విశాఖ వేదికగా సాగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్ మిఛెల్ మార్ష్ 36 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మరో 6 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నికోలస్ పూరన్ 30 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, మరో ఆరు బౌండరీలతో 75 పరుగులు సాధించాడు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 19.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. అశుతోష్ శర్మ చిరస్మరణీయ బ్యాటింగ్‌తో ఢిల్లీకి సంచలన విజయం సాధించి పెట్టాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ 31 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, 5 ఫోర్లతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. విప్రజ్ నిగమ్ 15 బంతుల్లోనే (39), స్టబ్స్ (34), డుప్లెసిస్ (29)లు కూడా అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. ఒక దశలో 65 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఇంత భారీ స్కోరును ఛేదించడం చిరస్మరణీయమనే చెప్పాలి.