- Advertisement -
న్యూఢిల్లీ: ఐపిఎల్ 18వ సీజన్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. నాలుగు మ్యాచులు ఆడితే.. నాలుగింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో ఉంది. మరోవైపు ముంబైకి ఈ సీజన్ అంతగా కలిసి రావడం లేదు. ఐదు మ్యాచుల్లో కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే నెగ్గి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. తన విజయపరంపరని కొనసాగించాలని ఢిల్లీ భావిస్తుంటే.. ఈ మ్యాచ్ విజయంతో పుంజుకోవాలని ముంబై అనుకుంటోంది. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై అదే జట్టుతో బరిలోకి దిగుతుండగా.. ఢిల్లీ ఒక మార్పు చేసింది. గాయపడిన డుప్లెసిస్ స్థానంలో అభిషేక్ పొరెల్‌ని జట్టులోకి తీసుకుంది.
- Advertisement -