Monday, April 14, 2025

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ 18వ సీజన్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు మంచి ఫాంలో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడిన మూడు మ్యాచుల్లో విజయం సాధించగా.. బెంగళూరు జట్టు ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింటిలో విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఇక బెంగళూరు హోం గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో ఈ మ్యాచ్ ఆ జట్టుకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఒక మార్పు చేసింది. సమీర్ రిజ్వి స్థానంలో డుప్లెసిస్‌ని జట్టులోకి తీసుకుంది. బెంగళూరు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News