Wednesday, January 22, 2025

ఢిల్లీ అదరహో.. గుజరాత్‌పై ఘన విజయం

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్‌లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య గుజరాత్ 17.3 ఓవర్లలో కేవలం 89 పరుగులకే కుప్పకూలింది. జట్టులో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. సాయి సుదర్శన్ (12), రాహుల్ తెవాటియా (10) పరుగులు చేశారు. ఇక రషీద్ ఖాన్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు, ఇషాంత్, స్టబ్స్ రెండేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 8.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా ఢిల్లీ కష్టపడాల్సి వచ్చింది. ఓపెనర్ జాక్ ఫ్రేజర్ (20), అభిషేక్ పొరెల్ (15), షాయ్ హోప్ (19), కెప్టెన్ రిషబ్ పంత్ 16 (నాటౌట్) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది మూడో విజయం కావడం విశేషం. ఇప్పటి వరకు ఢిల్లీ ఏడు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో గెలిచింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News