ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీ సాధించింది. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్‌లో ఫలితం తేలింది. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఆరు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ మరో రెండు బంతులు మిగిలుండగానే లక్షాన్ని చేధించింది. నాలుగు బంతుల్లో 12 పరుగులు చేసి సూపర్ విక్టరీ సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 49 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
కరుణ్ నాయర్ ఈసారి ఖాతా తెరవకుండానే రనౌట్‌గా వెనుదిరిగాడు. రాహుల్ 38 పరుగులు సాధించాడు. ధాటిగా ఆడిన స్టబ్స్ 18 బంతుల్లోనే రెండు సిక్స్‌లు, 2 ఫోర్లతో 34 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్ 14 బంతుల్లోనే 34 పరుగులు సాధించాడు. అశుతోష్ శర్మ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం లక్ష ఛేదనకు దిగిన రాజస్థాన్ బ్యాటర్లు నితేశ్ రాణా(51), యశస్వి జైశ్వాస్(51), సంజుసామ్‌సన్(31)లు రాణించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేశారు.