Monday, December 23, 2024

ఢిల్లీపై రుతురాజ్, కాన్వే జోరు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్‌కు చేరింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 77 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుగా ఓడించింది. ఢిల్లీపై ఘన విజయం సాధించిన చెన్నై నాకౌట్‌కు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైకు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వే మరోసారి శుభారంభం అందించారు.ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు.

ఈ జోడీని విడగొట్టేందుకు ఢిల్లీ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ 50 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, మరో మూడు బౌండరీలతో 79 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో తొలి వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యంలో పాలు పంచుకున్నాడు. ఇక ధాటిగా ఆడిన కాన్వే 52 బంతుల్లో 3 సిక్సర్లు, 11 బౌండరీలతో 87 పరుగులు చేశాడు. శివమ్ దూబే (22), రవీంద్ర జడేజా 20 (నాటౌట్) కూడా ధాటిగా ఆడడంతో సిఎస్‌కె స్కోరు 223 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News