ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో విజ యం నమోదు చేసింది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయంట్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఢిల్లీ 17.5 ఓవర్లలోనే కేవ లం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి జయకేతనం ఎగుర వేసింది. ఓపెనర్లు అభిషేక్ పొరె ల్, కరుణ్ నాయర్ జట్టుకు శుభారంభం అం దించారు. అయితే కరుణ్ 9 బంతుల్లో రెండు ఫోర్లు,ఒక సిక్స్‌తో 15 పరుగులు చేసి ఔటయ్యాడు.
అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన పొరెల్ 36 బంతుల్లో ఐదు ఫోర్లు, సిక్స్‌తో 51 పరుగులు చేశాడు. ఇక సమన్వయంతో బ్యాటింగ్ చేసిన రాహుల్ 42 బంతుల్లో 3 సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్ 20 బంతుల్లోనే 4 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 34 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నోను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఢిల్లీ బౌలర్లు సఫలమయ్యారు. ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను కట్టడి చేశాడు.