చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. చెన్నై కంచు కోట చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి మరో రెండు పాయింట్లను తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. 183 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటింగ్‌లో కెఎల్ రాహుల్ 77 పరుగుల చేశాడు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విజయ్ శంకర్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు.
ఢిల్లీ బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ.. పరుగులు చేస్తూ వచ్చాడు. కానీ, అతనికి మరో బ్యాట్స్‌మెన్ నుంచి మద్దతు లభించలేదు. ఆఖర్లో ధోనీతో కలిసి 84 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 158 పరుగులు చేసి హ్యాట్రిక్ పరాజయాలను సొంతం చేసుకుంది. అంతేకాక.. ఈ మ్యాచ్‌తో దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఢిల్లీ చెపాక్ స్టేడియంలో విజయం సాధించడం గమనార్హం.