- Advertisement -
విశాఖ : ఎట్టకేలకు ఎపిఎల్ 17 సీజన్లో ఢిల్లీ బోణీ కొట్టింది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ బౌలింగ్‌లలో సమష్టిగా రాణించిన ఢిల్లీ టీమ్ డిపెండింగ్ ఛాంపియన్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టులో పృథ్వి షా(43), డెవిడ్ వార్నర్(52)లు ఢిల్లీకి శుభారంభాన్ని అందించారు. అనంరం వన్ డౌన్‌లో వచ్చిన ఆ జట్టు సారధి రిషభ్ పంత్ (51) సయితం బ్యాట ఝలిపించాడు. దాంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం 192 పరుగుల లక్ష ఛేదనకు దిగిన చెన్నై ఢిల్లీ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి కేవలం పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై బ్యాటర్లలో రహానె(45), డారిల్ మిచెల్(34), జడేజా(21), ధోనీ(37) మాత్రమే రాణించారు.
- Advertisement -