- Advertisement -
ముంబై: ఐపిఎల్‌లో భాగంగా గురువారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42), నితీష్ రాణా (57), రింకు సింగ్ (23) మాత్రమే రాణించారు. మిగతావారు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ నాలుగు, ముస్తఫిజుర్ మూడు వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (42), లలిత్ యాదవ్ (22) మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచారు. చివర్లో పొవెల్ 33 (నాటౌట్), అక్షర్ పటేల్ (24) రాణించారు. దీంతో ఢిల్లీ జయభేరి మోగించింది.
- Advertisement -