Saturday, December 21, 2024

లక్నోపై గెలిచిన ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

లక్నో: ఐపిఎల్ లో భాగంగా లక్నోపై ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 168 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీంతో ఢిల్లీ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో జాక్ ప్రాసర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఫృధ్వీ షా(32), రిషబ్ పంత్(41) గౌరవ ప్రదమైన స్కోర్ చేయడంతో ఢిల్లీ సునాయసంగా విజయం సాధించింది. కులదీప్ తన బౌలింగ్ తో మాయ చేయడంతో లక్నో తక్కువ స్కోరు చేయగలిగింది. కులదీప్ మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News