Monday, April 21, 2025

సూపర్ ఓవర్…. రికార్డు సృష్టించిన ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఢిల్లీ గెలిచింది. ఐపిఎల్ చరిత్రలో సూపర్ ఓవర్‌లో అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా ఢిల్లీ రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఐపిఎల్‌లో 15 సూపర్ ఓవర్లు జరగగా ఢిల్లీలో నాలుగు, పంజాబ్ కింగ్స్ మూడింట్లో విజయం సాధించింది. ఢిల్లీ జట్టు ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు సూవర్ ఓవర్ ఆడగా పంజాబ్ నాలుగు మ్యాచ్‌ల్లో సూపర్ ఓవర్ ఆడింది.

ఈ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడారు. సూపర్ ఓవర్‌తో గెలవడం చాలా బాగుందన్నారు. ఢిల్లీ జట్టులో అద్భుతమైన బౌలర్ 12 యార్కర్లు వేసిన తరువాత గెలవకుండా ఉంటామా? అని ప్రశంసించారు. పవర్ ప్లే చూసిన తరువాత భారీగా పరుగులు చేస్తామనుకోలేదని, ఎక్కువగా బ్యాటింగ్ గురించే చర్చలు జరిపామని అక్షర పటేల్ తెలియజేశారు. ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అనేది కష్టంగా ఉందని ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అనుకున్నారని, తాము పిచ్‌ను అర్థం చేసుకొని భారీ స్కోరు సాధించామని వివరించారు. తాము బౌలింగ్ చేసేటప్పుడు అసలైన మజా ఉంటుందని భావించాం కానీ వారు దూకుడగా ఆడారని, ఈ క్రమంలో రెండు వికెట్లు పడిన తరువాత తమపై ఒత్తిడి తగ్గిందని అక్షర పటేల్ పేర్కొన్నారు. తాను బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించడం సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News