మరోవైపు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో పంత్‌కు ఆశించిన శుభారంభం లభించలేదు. తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఢిల్లీ ఓటమి పాలైంది. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా పంత్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేక పోయాడు. అయితే రాజస్థాన్‌పై మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జట్టును ముందుకు నడిపించాలనే లక్షంతో ఉన్నాడు. డేవిడ్ వార్నర్, మిఛెల్ మార్ష్, షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్‌ల రూపంలో విధ్వంసక బ్యాటర్లు ఢిల్లీలో ఉన్నారు. అయితే ఆరంభ మ్యాచ్‌లో వీరు భారీ స్కోర్లు సాధించలేక పోయారు.
కానీ రాజస్థాన్‌పై మాత్రం చెలరేగి ఆడాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. మార్ష్, వార్నర్, హోప్‌లు తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే రాజస్థాన్ బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. పంత్ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమయ్యాడు. ఇషాంత్ శర్మ, మార్ష్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఢిల్లీ కూడా భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది.