Thursday, January 23, 2025

నలుగురు పిల్లల ముందే భార్య గొంతునులిమి చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను భర్త పిల్లల ముందే గొంతు నులిమి చంపిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చంద్‌బాఘ్ ప్రాంతంలో ఉమీద్ సింగ్(40), శబ్నమ్ (35) అనే దంపతులు నివసిస్తున్నారు. శబ్నమ్ రెండో పెళ్లి ఉమీద్‌ను చేసుకుంది. శబ్నమ్ మొదటి భర్తతో కూతురు ఉండగా రెండో భర్తతో ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఉమీద్ సింగ్ కార్పెంటర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం శబ్నమ్ వివాహేతర సంబంధంపై పలుమార్లు గొడవలు జరిగాయి. ఘర్షణ తారాస్థాయికి చేరుకొవడంతో పిల్లల ముందే భార్య గొంతు భర్త నుమిలాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శబ్నమ్‌ను జగ్ ప్రవేశ్ చంద్రా ఆస్పత్రికి తరలించారు. ఆమె అప్పటికే చనిపోయిందని పరిశీలించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేస ఉమీద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News