Sunday, January 19, 2025

కేజ్రీ జ్యుడీషియల్ కస్టడీ కోరిన ఇడి

- Advertisement -
- Advertisement -

జూన్ 2న లొంగిపోనున్న ఢిల్లీ సిఎం
న్యూఢిల్లీ : ఎక్సైజ్ పాలసీతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో జూన్ 2న ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ లొంగిపోయిన తరువాత ఆయన జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని ఇడి సోమవారం కోరింది. జూన్ 2న కేజ్రీవాల్ లొంగిపోయినప్పుడు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ కోరుతూ ఇడి, సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఒక అర్జీ దాఖలు చేసింది. ఇంతకు ముందు మంజూరైన జ్యుడీషియల్ కస్టడీ గడువు సోమవారం ముగిసిందని ఇడి తెలిపింది.

సుప్రీం కోర్టు ఉత్తర్వును పురస్కరించుకుని కేజ్రీవాల్ జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. జూన్ 2న లొంగిపోవాలని ఆయనను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇది ఇలా ఉండగా, కేజ్రీవాల్‌పై, సహ నిందితురాలు భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) నాయకురాలు కె కవితపై కేసులో విచారణ జరపడానికి వారికి వ్యతిరేకంగా తగినన్ని సాక్షాధారాలు ఉన్నాయని ఇడి కోర్టులో తెలిపింది. ఆ ఇద్దరు రాజకీయ నేతలపై దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లకు మద్దతుగా ఇడి తన వాదనలు వినిపించింది. చార్జిషీట్లను పరిగణనలోకి తీసుకునే విషయంలో ఇడి వాదనలను న్యాయమూర్తి మంగళవారం విచారణ కొనసాగిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News