Thursday, January 23, 2025

తండ్రి, కుమారుడిని పొడిచి చంపారు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: తండ్రి, కుమారుడిని కత్తులతో పొడిచి చంపిన సంఘటన ఢిల్లీలోని చిరాగ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుమహర్ ప్రాంతంలో జై భగవాన్ అనే వ్యక్తి నివసించేవాడు. భగవాన్ తన వీధిలో ఉండే ప్రతి ఒక్కరితో గొడవలకు దిగేవాడు. ఈ క్రమంలో పక్కింటి వ్యక్తితో ఘర్షణకు దిగాడు. నలుగురు వ్యక్తులు కలిసి భగవాన్, ఆయన కుమారుడిని కత్తులతో పొడిచి హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. చిన్న చిన్న గొడవలే హత్యలకు దారి తీశాయని డిసిపి అంకిత్ చౌహాన్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News