స్కోర్ : అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తీవ్రమైన అపెండిసైటిస్‌తో బాధపడుతున్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. రాహుల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. కిందటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించిన పంజాబ్ ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. హర్‌ప్రీత్ బరార్ రూపంలో పంజాబ్‌కు కొత్త అస్త్రం లభించింది. కిందటి మ్యాచ్‌లో అతను ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతని నుంచి జట్టు అలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. గేల్ తన విధ్వంసక బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. మరోవైపు ఢిల్లీ కూడా వరుస విజయాలతో జోరుమీదుంది. ఇప్పటికే ఐదు విజయాలు సాధించిన ఢిల్లీ ఈసారి కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్‌లు ఫామ్‌లో ఉండడం జట్టుకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.