Friday, December 20, 2024

కేబినెట్ కన్నా.. మీ సెక్రెటరీ గొప్పనా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రజలతో ఎన్నుకోబడ్డ చట్టబద్ధ ప్రభుత్వం కన్నా ప్రధాన కార్యదర్శి గొప్పనా? అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రశ్నించారు. ఢిల్లీలో అధికారిక వ్యవస్థ నియామకాలు, సేవల అధీకృత బాధ్యతలను తీసుకుంటూ కేంద్రం ఆర్డినెన్స్ తేవడం వల్ల జరిగిన విషమ పరిణామాన్ని కేజ్రీవాల్ ప్రస్తావించారు. ప్రధాన కార్యదర్శికి అధిక అధికారాలు కల్పించే విషయాన్ని తాము సుప్రీంకోర్టులో పిటిషన్ ద్వారా సవాలు చేస్తామని ఆయన తెలిపారు.

కేంద్రం ఆర్డినెన్స్‌తో ఇప్పుడు ఢిల్లీలో కేంద్రం పరిధిలో నియుక్తులయ్యే చీఫ్ సెక్రెటరీ కేబినెట్ కన్నా ఎక్కువ అధికారాలను పొందుతారని తెలిపారు. నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథార్టీ ( ఎన్‌సిసిఎస్‌ఎ) తొలి సమావేశంలో పాల్గొన్న తరువాత సిఎం కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడారు. ఎక్కడైనా కేబినెట్ కన్నా సిఎస్ గొప్ప అనే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను హరిస్తూ, అధికారుల నియామక ప్రక్రియను కేంద్రం నేరుగా తన చేతుల్లోకి తీసుకుంటూ ఇటీవల ఓ ఆర్థినెన్స్ రూపకల్పనకు రంగం సిద్ధం చేసుకుంది.

దీనికి వ్యతిరేకంగా పలు ప్రతిపక్షాల నుంచి మద్దతును కూడగట్టుకునేందుకు కేజ్రీవాల్ పలు రాష్ట్రాలకు వెళ్లి వచ్చారు. కేంద్రంలోని బిజెపి ఢిల్లీలోని ప్రభుత్వాన్ని తమ తాబేదార్లు అయిన ఐఎఎస్ అధికారులతో శాసించాలని చూస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు. సివిల్ సర్వీసెస్ అథార్టీకి చెందిన అధికారులు చివరికి మంత్రుల నిర్ణయాలను కూడా తిరస్కరించే అధికారం పొందారని ఇది దారుణం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News