Sunday, December 22, 2024

నా పార్టీని నాశనం చేసేందుకు మోడీ కుట్ర చేస్తున్నారు: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

అమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. బిజెపి, ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆప్ నేతలందరినీ జైల్లో పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఫైరయ్యారు. తనపై అన్ని తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు.

ఢిల్లీ ఆప్ ప్రధాన కార్యాలయం ముందు సిఎం కేజ్రీవాల్  మాట్లాడుతూ.. తన పార్టీని నాశనం చేసేందుకు ప్రధాని మోడీ కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఖలిస్థాన్ ఉగ్రవాదిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రధాని ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయొచ్చా అని ఆయన ప్రశ్నించారు. తనతో సహా మా పార్టీ మంత్రులను జైల్లో పెట్టారని.. నిన్న తన పిఎను కూడా అరెస్టు చేశారని దుయ్యబట్టారు.

కాగా, ఢిల్లీలోని బిజెపి పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు శనివారం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. దీంతో పెద్ద ఎత్తున ఆప్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. బిజెపి కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బిజెపి కార్యాలయం వద్ద ఉదయం నుంచే భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మొహరించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో దేశ రాజధాని నగరంలో ఆప్, బిజెపి పార్టీల మధ్య పొలిటికల్ వార్ రోజురోజుకు ముదురుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News