Sunday, January 19, 2025

మోడి ఆడిస్తున్నారు..గవర్నర్లు రాజకీయం చేయిస్తున్నారు : కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : కేంద్రంలోని మోడి ప్రభుత్వం నియమించిన గవర్నర్లు విపక్ష పాలిత రాష్ట్రాల్లో రాజకీయం చేస్తున్నారని, విపక్ష సిఎంలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. గవర్నర్లకు ఢిల్లీ నుండి ఒత్తిడి ఉందన్నారు. ఖమ్మం బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభలో కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు. తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో గవర్నర్లు ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని, అభివృద్ధి పనులకు అడ్డుతగలడమే గవర్నర్ల పని అన్నట్లుగా ఉందని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ళ తర్వాత కూడా దేశం వెనుకబడే ఉందని, మన తర్వాత స్వాతంత్య్రం పొందిన సింగపూర్ అభివృద్ధిపథంలో దూసుకుపోతోందన్నారు. మనమేంపాపం చేసుకున్నామని వెనుకబడి ఉన్నామని ఆయన ప్రశ్నించారు.

మన దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర స్థితిలో ఉందని, 2024 ఎన్నికల్లో దేశమంతా కలిసి బిజెపిని తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను పెద్దన్నగా సంబోధించారు. తెలంగాణ రాష్ట్రం నుండి చాలా నేర్చుకున్నామని డిల్లీ ముఖ్యమంత్రి చెప్పారు. కంటి వెలుగు, సమీకృత కలెక్టరేట్ల కాన్సెప్ట్ అద్భుతమని ప్రశంసించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. కంటిపరీక్షలు ఉచితంగా అందించడం గొప్ప విషయమని చెప్పారు. ఈ కార్యక్రమాలను ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామన్నారు. సమీకృత కలెక్టరేట్లను నిర్మించే విషయాన్ని పరిశీలిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ మొహల్లా క్లినిక్‌లు మంచి ఫలితాలు నిస్తోందని వాటిని చూసే ముఖ్యమంత్రి కెసిఆర్ ఇక్కడ బస్తీ దవాఖానాలుగా అమలు చేస్తున్నారని చెప్పారు. మేము ఒకరి నుంచి మరొకరం నేర్చుకుంటామని చెప్పారు. తమిళనాడు సిఎం స్టాలిన్ ఢిల్లీ పాఠశాలలను పరిశీలించారని తమిళనాడులోనూ పాఠశాలలు బాగుచేస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో ప్రైవేటు స్కూళ్ళ విద్యార్థులు కూడా ప్రభుత్వ స్కూళ్ళలో చేరుతున్నారని కేజ్రీవాల్ తెలిపారు. రు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News