- Advertisement -
న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో ఏడాది కాలంగా జైలులో ఉండి బెయిలుపై వచ్చిన ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆదివారం ఆస్పత్రిలో కలుసుకుని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనను హత్తుకున్నారు. ఆయనకు అందుతున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఈ ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘దైర్యవంతుడ్ని, హీరోని కలిశాను’ అని అందులో పేర్కొన్నారు.
సత్యేందర్ జైన్‌ను గత ఏడాది మేలో ఈడీ అరెస్టు చేసింది. అనారోగ్యానికి గురై ఇటీవల బరువు తగ్గిన జైన్ ఇటీవల జైలులో బాత్ రూమ్‌లో పడిపోవడంతో తలకు , చేతికి గాయమైంది. ఈ పరిస్థితుల్లో ఆరువారాల పాటు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన ఢిల్లీ లోని లోక్‌నాయక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
- Advertisement -