Thursday, January 16, 2025

ప్రధాని మోడీతో ఢిల్లీ సిఎం ఆతిశీ భేటీ

- Advertisement -
- Advertisement -

బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి
ఢిల్లీ అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం సహకరిస్తుందని ఆశిస్తున్నాం
సిఎం నివాసం కేటాయింపుపై ఎల్‌జితో మాటల పోరు నేపథ్యంలో ప్రాధాన్యం

న్యూఢిల్లీ : ఢిలీ ముఖ్యమంత్రి ఆతిశీ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఆమె సిఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి ప్రధానిని కలిశారు. ప్రధానితో భేటీ తరువాత ఆతిశీ మాట్లాడుతూ, ఢిల్లీ అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందుతుందని ఆశిస్తున్నట్లు తెలియజేశారు.

ఢిల్లీలో ముఖ్యమంత్రి నివాసం కేటాయింపుపై లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనాతో ప్రభుత్వానికి మాటల పోరు సాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి ప్రధానితో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయినట్లు సిఎం ఆతిశీ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. మన దేశ రాజధానిలో సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య సహకారం ఉంటుందని ఆశిస్తున్నట్లు ఆతిశీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News