Wednesday, October 16, 2024

ఢిల్లీ సిఎం నివాసం నుంచి ఆతిశీ తరలింపు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీని అధికార నివాసంనుంచి ఖాళీ చేయించారని ఆప్ బుధవారం ఆరోపించింది. ఆమె రెండు రోజుల క్రితమే ఆ నివాసంలోకి మారారు. దీనితో ఆప్, కేంద్రం మధ్య ఘర్షణకు నాంది సూచకంగా లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) వినయ్ సక్సేనా ‘బిజెపి ప్రేరణతో’ అధికారిక నివాసంలో నుంచి ఆతిశీ వస్తువులను ‘బలవంతంగా తొలగించారు’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ)ఆరోపించింది. అయితే, ఆ ఆరోపణను సక్సేనా కార్యాలయం ఖండించింది. ‘దేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేయించారు. బిజెపి ఆదేశంతో లెఫ్టినెంట్ గవర్నర్ సిఎం నివాసం నుంచి సిఎం ఆతిశీకి సంబంధించిన వస్తువులను బలవంతంగా తొలగించారు’ అని సిఎంఒ ఆరోపించింది.

ఆప్ ఆరోపణను ఎల్‌జి కార్యాలయ వర్గాలు తోసిపుచ్చాయి. ‘ఆతిశీ తనకు ఆ నివాసాన్ని కేటాయించక ముందే తన వస్తువులను స్వయంగా అక్కడ ఉంచి, ఆ తరువాత తనంతట తానే వాటిని తొలగించారు’ అని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. ‘ముఖ్యమంత్రి ఆతిశీకి ఇంకా ఆ నివాసాన్ని కేలాయించలేదు. ఆమెకు కేటాయించిన నివాసం ఇప్పటికీ 17 ఎబి మథుర రోడ్ భవనమే. రెండు నివాసాలు ఎలా కేటాయింపు పొందుతారు?’ అని ఆ వర్గాలు వాదించాయి. ఆతిశీని అర్వింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రిగా నియమించిన తరువాత ఆమెకు నిరుడు ఎబి 17 నివాసాన్ని కేటాయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News