న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ వేరియంట్ కామెంట్లపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగపూర్ వైరస్ రకంతో భారత్ లో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న ఢిల్లీ సిఎం వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి జయశంకర్ ఘాటుగా స్పందించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతీసేలా మాట్లాడొద్దంటూ జయశంకర్ ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను పట్టించుకోవద్దంటూ విదేశాంగశాఖ క్లారిటీ ఇచ్చింది. కేజ్రీవాల్ కామెంట్లపై సింగపూర్ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ నేతలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సింగపూర్ మంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి బాధ్యతరహితమైన వ్యాఖ్యలతో దేశాల మధ్య దీర్ఘకాలిక బంధాలు దెబ్బతింటాయని జయశంకర్ విమర్శించారు. దేశం తరుపున మాట్లాడేది ఢిల్లీ సిఎం కాదన్నారు. కోవిడ్ పై పోరులో సింగపూర్, భారత్ పార్ట్ నర్స్ అని, ఆక్సిజన్ సరఫరా ఆ దేశం హెల్ప్ చేస్తోందని ఆయన తెలిపారు.
Delhi CM does not speak for India Says Jaishankar