Saturday, December 21, 2024

తీహార్ జైలులో కేజ్రీవాల్: తొలిరోజు నీరసం… పడిపోయిన సుగర్ లెవల్స్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో అరెస్టైన్ కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను 14×8 విస్తీర్ణం కలిగిన సెల్‌లో ఉంచారు. మొదటిరోజు రాత్రి కేవలం కొద్దిసేపు మాత్రమే నిద్రపోయినట్టు జైలు వర్గాలు వెల్లడించాయి. “సోమవారం సాయంత్రం 4 గంటలకు కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తీసుకు వచ్చారు. సెల్‌లోకి పంపించే ముందు ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. అప్పుడు ఆయన రక్తంలో చక్కెర స్థాయి 50 కంటే తక్కువ ఉంది. వైద్యుల సూచన మేరకు ఔషధాలు అందించాం” అని జైలు అధికారులు వెల్లడించారు.

జైలులో ఆయనకు ఓ పరుపు, దుప్పట్లు, రెండు దిండ్లు సమకూర్చినట్టు సమాచారం. మధ్యాహ్నం ఛాయ్, రాత్రి భోజనంగా ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అందించారు. రాత్రి కొద్ది సేపు కటిక నేలపైనే పడుకున్నారని, అర్ధరాత్రి వరకు సెల్‌లో అటుఇటు తిరుగుతూ కనిపించారని జైలు అధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయాన్నే తన సెల్‌లో ధ్యానం చేసుకున్న కేజ్రీవాల్‌కు అనంతరం ఛాయ్, రెండు బిస్కట్లు అందించారు. అనంతరం మరోసారి వైద్య పరీక్షలు చేశారు. సుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని ప్రస్తుతం ఆయన జైలు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

మధ్యాహ్నం, రాత్రి భోజనంగా ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అనుమతిస్తామని, రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేవరకు వీటిని కొనసాగిస్తామని చెప్పారు. ఆయన కోరిన విధంగానే ఆయనకు రామాయణం, భగవద్గీత ,హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అనే పుస్తకాలను అందించారు. దీంతో పాటు ఆయన మెడలో ఉన్న లాకెట్‌ను అనుమతించారు. నిబంధనల ప్రకారం ఆయన ఆరుగురు వ్యక్తులను కలిసేందుకు అవకాశం ఉంటుంది. ఆయన భార్య సునీత, ఇద్దరు పిల్లలు, వ్యక్తిగత కార్యదర్శి భిభావ్ కుమార్ , ఆప్ జనరల్ సెక్రటరీ సందీప్ పాఠక్‌ల పేర్లను కేజ్రీవాల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం తీహార్ జైలులో నంబర్ 2 విభాగంలో కేజ్రీవాల్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News