Thursday, December 19, 2024

ఆప్ ఎమ్మెల్యేలకు బిజెపి ఎర.. ఒక్కొక్కరికి కోట్లలో ఆఫర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ. 25 కోట్ల ఆఫర్‌తో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఆరోపించారు. ఆప్ శాసనసభ్యులతో బిజెపి చర్చలు జరుపుతోందని, ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రిని త్వరలో అరెస్టు చేస్తామని బెదిరించిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఏడుగురికి బిజెపి నుంచి టికెట్లు కూడా ఇస్తామని ఆశ చూపిందని ఆరోపించారు. అటు ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ఆరోపణలను బిజెపి ఖండించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News