Wednesday, March 12, 2025

నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించనున్న కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు, కేంద్రానికి మధ్య ఓ పక్క చిచ్చు రగులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ సమావేశం శనివారం జరుగనున్నది. దీన్ని పురస్కరించుకుని కేజ్రీవాల్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. అందులో ఆయన ‘ఒకవేళ ప్రధానే సుప్రీంకోర్టు ఉత్తర్వుకు కట్టుబడి ఉండనప్పుడు ఇక ప్రజలకు న్యాయం ఎక్కడ లభిస్తుంది? అని ప్రజలు అడుగుతున్నారు. సహకార సమాఖ్యవాదమే ఓ జోక్ అయినప్పుడు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవ్వడంలో అర్థమేముంది?’ అని రాశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News