Thursday, January 23, 2025

కెసిఆర్‌తో భేటీ కానున్న ఢిల్లీ సిఎం.. ఆయనతో పాటు మరో ముఖ్యమంత్రి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయంకు కేజ్రీవాల్ చేరుకోనున్నారు. కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సిఎం భగవంత్ సింగ్ మాన్, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి హైదరాబాద్ కు వస్తున్నారు. సిఎం కెసిఆర్ తో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, మంత్రి అతిషి భేటీ కానున్నారు.

కేంద్రప్రభుత్వ ఆర్డినెన్స్ పై కేజ్రీవాల్ మద్దతు కూడగడుతున్నారు. ఢిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగులపై ఇటీవల కేంద్రం ఆర్డినెన్సు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్రంపై పోరాటానికి ఢిల్లీ సిఎం విపక్షాల మద్దతు కోరుతున్నారు. దేశ రాజకీయాలు, పాలనాపరమైన అంశాలపై ఇద్దరు సిఎంలు చర్చించనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు కేజ్రీవాల్ ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News