- Advertisement -
న్యూఢిల్లీ : ఆఫ్రికా ఖండం లోని దక్షిణాది దేశాల్లో కొత్తరకం కరోనా ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ప్రభావిత దేశాలకు భారత్ నుంచి ఆయా విమానాల రాకపోకలను నిలిపి వేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. మనం ఎన్నో కష్టాలు పడి కరోనా బారి నుంచి కోలుకున్నామని, కొత్తవేరియంట్ దేశంలో ప్రవేశించకుండా అడ్డుకోడానికి మనం అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
- Advertisement -