Friday, December 20, 2024

ఢిల్లీ ప్రజలకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 10 కీలక వాగ్దానాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు డిసెంబర్ నాలుగున ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), భారతీయ జనతా పార్టీ(బిజెపి) మధ్య రచ్చ మొదలయింది. మొత్తం 250 వార్డులకు డిసెంబర్ 4న ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలు 7న వెల్లడి కానున్నాయి. ప్రధానంగా ఆప్, బిజెపి, కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీలు గుప్పించారు. ఆప్ ఏది చెబుతుందో అదే చేస్తుందన్నారు. ఢిల్లీని స్వచ్ఛ ఢిల్లీగా మారుస్తానన్నారు.

ఢిల్లీ కి బిజెపి గత 15 ఏళ్లలో చేసిందేమి లేదని అన్నారు. ఆ పార్టీకి 20కి మించి సీట్లు రావడం కష్టమన్నారు. ఓటర్లు ఆప్ నే గెలిపించాలన్నారు. అంతేకాక 10 వాగ్దానాలు గుప్పించారు. అవి: 1. ఢిల్లీ సుందరీకరణ. చెత్తను తొలగిస్తాం, 2.రోడ్లు, వీధుల్ని శుభ్రపరుస్తాం, 3. ఆసుపత్రులు, పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచుతాం, 4.పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం, 5. ఢిల్లీలో కోతులు, కుక్కలు, ఆవుల బెడద నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తాం, 6.పాఠశాలలు, ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తాం, 7. పార్కులను సుందరీకరిస్తాం, నగరాన్ని పార్కుల నగరంగా మారుస్తాం, 8.తాత్కాలిక ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తాం, వేతనాలను సకాలంలో చెల్లిస్తాం, 9. వర్తకులకు ఆన్‌లైన్ ద్వారా లైసెన్సులు మంజూరు చేస్తాం, ఇన్‌స్పెక్టర్ రాజ్‌కు మంగళం పాడుతాం, 10. వీధి వ్యాపారుల కోసం వాణిజ్య జోన్‌లను ఏర్పాటు చేస్తాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News