రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో బాధితురాలు అంజలితోపాటు మరో యువతి ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. వీరిద్దరూ ప్రయాణిస్తున్న స్కూటీ కారును ఢీకొట్టి ప్రమాదం జరిగిన అనంతరం ఆ యువతి భయంతో అక్కడినుంచి పారిపోయిందని పోలీసులు మంగళవారం తెలిపారు. ఆ యువతి అంజలి స్నేహితురాలు నిధిగా పోలీసులు గుర్తించారు. నిధిని పిలిచి సిఆర్‌పిసి 164 ప్రకారం ఆమె స్టేట్‌మెంట్‌ను నమోదుచేసినట్లు సిపి వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఫుటేజ్ ప్రకారం అంజలి, నిధి న్యూఇయర్ పార్టీ అనంతరం నుంచి రాత్రి 1.45ఎఎం సమయంలో బయలుదేరారు. బాధితురాలు పింక్ కలర్ టీషర్ట్ ధరించి ఉండగా స్నేహితురాలు ఎరుపురంగు దుస్తులు ధరించింది.
తొలుత స్నేహితురాలు సూటీని నడపగా అంజలి వెనుకసీటులో కూర్చుంది. కొంతదూరం ప్రయాణించిన అనంతరం వారు తమ స్థానాలు మార్చుకున్నారు. అంజలి స్కూటీని నడపగా ఆమె స్నేహితురాలు వెనుక కూర్చుంది. ఈక్రమంలో అంజలి స్కూటీతో కారును ఢీకొట్టిన అనంతరం బయటపడిన స్నేహితురాలు సంఘటన ప్రాంతం నుంచి ధేరిపోయింది. కారు వెనుకభాగంలో స్కూటీ ఇరుక్కుపోవడంతో అంజలి కూడా చిక్కుకుపోయింది. 12కిలోమీటర్లు కారును అంజలిని రోడ్డుపై ఈడ్చుకుపోవడంతో తీవ్రగాయాలతో మరణించింది. మంగళవారం నిందితులను సంఘటన ప్రాంతానికి తీసుకువెళ్లిన పోలీస్ దర్యాప్తు బృందం రీక్రియేట్ చేసి పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగురు నిందితులు మద్యం మత్తులో ఉన్నారని దర్యాప్తు బృందం వెల్లడించింది.