Sunday, December 22, 2024

నేడు మరోసారి కేజ్రీవాల్ కు నోటీసులు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు నేడు మరోసారి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. కేజ్రీవాల్, ఆప్ నేతల ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. తమ ఎమ్మెల్యేలను బిజెపి ప్రలోభాలకు గురిచేస్తుందని ఆప్ నేతలు అంటున్నారు. కేజ్రీవాల్ ,ఆప్ నేతల ఆరోపణలపై గత నెల ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిజెపి నేతల ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు శుక్రవాం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు. ఆప్ నేతల ఆరోపణలపై పోలీసులు కేజ్రీవాల్ ను ఆధారాలు కోరారు. కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు నిన్న ప్రయత్నించారు. అరగంట వేచి చూసి నోటీసు ఇవ్వకుండానే వెనుదిరిగారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే నేడు మరోసారి కేజ్రీవాల్ కు నోటీసులు ఇస్తామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నోటీసు తీసుకునేందుకు కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్న ఇవ్వలేదని సిఎంవో ప్రకటిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News