Monday, December 23, 2024

ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ ప్రమాణ స్వీకారానికి కోర్టు అనుమతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ సీనియర్ నేత సంజయ్‌సింగ్ ప్రమాణ స్వీకారానికి రౌస్ అవెన్యూ కోర్టు శనివారం అనుమతించింది. ఈనెల 5న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆరోజు ఉదయం 10 గంటలకు ఆయనను పార్లమెంట్‌కు తీసుకువెళ్లాల్సిందిగా జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు , ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరుకాడానికి తనకు తాత్కాలిక బెయిలు మంజూరు చేయాలని సంజయ్‌సింగ్ గత గురువారం నాడు కోర్టును ఆశ్రయించారు. ఫిబ్రవరి 4 నుంచి 10 వరకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని కోరారు. దీనిపై ఫిబ్రవరి 3 లోగా సమాధానం ఇవ్వాలని ఈడీని ప్రత్యేక న్యాయమూర్తి ఎంకెనాగ్‌పాల్ నోటీస్ జారీ చేశారు. మనీలాండరింగ్ కేసులో గత ఏడాది అక్టోబర్ 4న సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్టు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News