Monday, November 11, 2024

బొగ్గు కుంభకోణంలో మాజీ ఎంపికి నాలుగేళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో బొగ్గు బ్లాకుల కేటాయింపులో అక్రమాలకు సంబంధించిన కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ్ దర్దా, ఆయన కుమారుడు దేవేందర్ దర్దా, వ్యాపారి మనోజ్ కుమార్ జయస్వాల్‌కు ఢిల్లీ కోర్టు బుధవారం నాలుగేళ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

కోర్టు ఉత్తర్వులను పురస్కరించుకుని ముగ్గురు దోషులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సి గుప్తా, ఇద్దరు మాజీ సీనియర్ ప్రభుత్వాధికారులు కెఎస్ క్రోఫా, కెసి సమ్రియాలకు కూడా మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంజయ్ బన్సల్ తీర్పు చెప్పారు. కాగా..ఈ శిక్షను హైకోర్టులో సవాలు చేసేందుకు అవకాశం ఇస్తూ ఈ ముగ్గురు దోషులకు వ్యక్తిగత బాండుపై న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో దోషిగా తేలిన విఎల్‌డి యవత్మాల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 50 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది.

గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని కుదిపేసిన బొగ్గు కుంభకోణంలో ఏడుగురిని దోషులుగా ప్రకటించిన ప్రత్యేక కోర్టు బుధవారం శిక్షా కాలాన్ని వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News