Friday, November 15, 2024

దిశారవికి బెయిల్ మంజూరు

- Advertisement -
- Advertisement -

Delhi Court Bail granted to Disha Ravi

న్యూఢిల్లీ: టూల్‌కిట్ కేసులో అరెస్టయిన పర్యావరణ కార్యకర్త దిశారవికి బెయిల్ మంజూరైంది. ఢిల్లీలోని పటియాల హౌస్ కోర్టు మంగళవారం ఆమెకు బెయిలు మంజూరు చేసింది. రూ.లక్ష సొంత పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమవేత్త గ్రెటా థన్‌బెర్గ్ షేర్ చేసిన టూల్‌కిట్‌ను రూపొందించడంలో సామాజిక కార్యకర్త దిశారవితో పాటుగా నికితా జాకబ్, శంతను ములక్‌లకు సంబంధం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.ఈ కేసులో ఈ నెల 13న బెంగళూరులోని తన నివాసంలో దిశారవిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ఆరు రోజులు పోలీసు కస్టడీలో, రెండు రోజులు జైల్లో ఉన్నారు.

సోమవారం పొడిగించిన ఒక రోజు పోలీసు కస్టడీ గడువు కూడా ముగియడంతో మంగళవారం అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ‘టూల్‌కిట్’ అంటే ఏమిటని ప్రశ్నించారు. పోలీసుల దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని, ఆధారాలు అస్పష్టంగా ఉన్నాయని అంటూ, ఎలాంటి నేర చరిత్ర లేని 22 ఏళ్ల యువతికి బెయిల్ మంజూరు చేయకుండా ఉండడానికి తనకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదన్నారు. అయితే లక్ష రూపాయలు పూచీకత్తు చెల్లించడం దిశారవికి కష్టతరమని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. కాగా ఇదే కేసులో నికితా జాకబ్, శంతను ములుక్‌లకు బాంబే హైకోర్టు గతంలోనే ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News