Monday, December 23, 2024

నీలమ్ ఆజాద్‌కు బెయిల్ నిరాకరణ

- Advertisement -
- Advertisement -

బెయిల్ దరఖాస్తును తిరస్కరించిన ఢిల్లీ కోర్టు
ఈ దశలో బెయిల్ ఇవ్వలేమన్న న్యాయమూర్తి
పార్లమెంట్ భద్రత ఉల్లంఘన కేసు

న్యూఢిల్లీ : పార్లమెంట్ భద్రత ఉల్లంఘన కేసులో నిందితురాలు నీలమ్ ఆజాద్ బెయిల్ దరఖాస్తును ఢిల్లీలో ఒక కోర్టు గురువారం తిరస్కరించింది. నీలమ్ ఆజాద్‌కు బెయిల్ నిరాకరించిన అదనపు సెషన్స్ న్యాయమూర్తి హర్దీప్ కౌర్ ఈ దశలో ఆమెకు బెయిల్ మంజూరు చేయడం సబబు కాదని అన్నారు. ఈ కేసులో నిందితులు ఆజాద్, మనోరంజన్ డి, సాగర్ శర్మ, లలిత్ ఝా, అమోల్ షిండే, మహేష్ కుమావత్ పోలీస్ రిమాండ్ గడువు ముగియడంతో గత శనివారం వారిని తమ ముందు హాజరు పరచినప్పుడు వారిని జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు పంపింది.

2001 పార్లమెంట్ ఉగ్ర దాడి వార్షికోత్సవం నాడు పార్లమెంట్ భద్రతను ఉల్లంఘిస్తూ ఇద్దరు వ్యక్తులు సాగర్ శర్మ, మనోరంజన్ డి జీరో అవర్‌లో పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్‌సభ చాంబర్‌లోకి దూకి, కానిస్టర్ల నుంచి పసుపు వాయువును వెదజల్లి, నినాదాలు చేశారు. అటుపిమ్మట కొందరు ఎంపిలు వారిని లొంగదీసుకున్నారు. అదే సమయంలో మరి ఇద్దరు నిందితులు అమోల్ షిండే, నీలమ్ ఆజాద్ పార్లమెంట్ భవనం వెలుపల ‘తానాషాహి నహీ చలేగీ’ అని నినదిస్తూ కానిస్టర్ల నుంచి రంగు వాయువును వెదజల్లారు. ఆ నలుగురిని వెంటనే అరెస్టు చేశారు. ఈ సంఘటనలో పాత్ర ఉండనే ఆరోపణతో లలిత్ ఝాను, కుమావత్‌ను ఆ తరువాత నిర్బంధంలోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News